మైదానంలోనే గుండెపోటు
ABN , Publish Date - May 25 , 2026 | 04:25 AM
కర్ణాటక మాజీ ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ అక్షయ్ మైదానంలో గుండెపోటుతో మరణించాడు. ఆదివారం జరిగిన...
కర్ణాటక క్రికెటర్ మృతి
బెంగళూరు: కర్ణాటక మాజీ ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ అక్షయ్ మైదానంలో గుండెపోటుతో మరణించాడు. ఆదివారం జరిగిన డివిజన్ 3 మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా మొదట తీవ్ర అసౌకర్యానికి గురయ్యాడు. అనంతరం 4 ఓవర్లు బౌలింగ్ చేశాక మైదానం వీడి విశ్రాంతి తీసుకున్నాడు. తిరిగి మైదానంలోకి అడుగుపెట్టిన అక్షయ్ ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.
ఇవి కూడా చదవండి:
అర్జున్ కోసం సారా టెండూల్కర్ ఎమోషనల్ పోస్ట్
ఐపీఎల్ చరిత్రలో తొలి బౌలర్‌గా మహమ్మద్ షమీ..