ఫేవరెట్లు భారత జట్లు
ABN , Publish Date - Sep 16 , 2026 | 05:06 AM
చెస్ ఒలింపియాడ్‌లో డిఫెండింగ్ చాంప్‌లు భారత పురుషులు, మహిళల జట్లు మరోసారి ఫేవరెట్‌లుగా బరిలోకి దిగుతున్నాయి...
చెస్ ఒలింపియాడ్ నేటి నుంచి
సమర్‌ఖండ్ (ఉజ్బెకిస్థాన్): చెస్ ఒలింపియాడ్‌లో డిఫెండింగ్ చాంప్‌లు భారత పురుషులు, మహిళల జట్లు మరోసారి ఫేవరెట్‌లుగా బరిలోకి దిగుతున్నాయి. మంగళవారం నుంచి టోర్నీ జరగనుండగా.. పురుషుల జట్టు ఆశలన్నీ వరల్డ్ చాంపియన్ గుకేష్ దొమ్మరాజు, ప్రజ్ఞానందపైనే ఎక్కువగా ఉన్నాయి. కాగా.. గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన జోష్‌లో ఉన్న ప్రజ్ఞానంద మరోసారి అదే తరహా ప్రదర్శనతో అదరగొట్టాలనుకొంటున్నాడు. అర్జున్ ఇరిగేసి, విదిత్ గుజరాతి, నిహాల్ సరీన్ జట్టు భారత జట్టు పటిష్టంగా ఉంది. కాగా, కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్, వైశాలితో భారత మహిళల జట్టు కూడా బలంగా కనిపిస్తోంది. 2024 టోర్నీలో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ద్రోణవల్లి హారిక, తానియా సచ్‌దేవ్‌లు ఈసారి దూరమయ్యారు. భారత జట్టు డిఫెండింగ్ చాంప్‌గానే కాకుండా టాప్‌సీడ్‌గా బరిలోకి దిగుతోంది.