ఆసియా చెస్ విజేతలు
ABN , Publish Date - Aug 18 , 2026 | 05:45 AM
తెలుగు చదరంగ క్రీడాకారులు అద్వైత్ విఘ్నేశ్, శరణ్యా దేవి అంతర్జాతీయ వేదికపై అదరగొట్టారు. ఆసియా జూనియర్ చెస్ చాంపియన్‌షి్‌పలో హైదరాబాద్ ఆటగాడు విఘ్నేశ్ ఓపెన్ విభాగంలో..
విఘ్నేశ్, శరణ్య
ముంబై: తెలుగు చదరంగ క్రీడాకారులు అద్వైత్ విఘ్నేశ్, శరణ్యా దేవి అంతర్జాతీయ వేదికపై అదరగొట్టారు. ఆసియా జూనియర్ చెస్ చాంపియన్‌షి్‌పలో హైదరాబాద్ ఆటగాడు విఘ్నేశ్ ఓపెన్ విభాగంలో, గుంటూరు అమ్మాయి శరణ్య బాలికల బ్లిట్జ్ ఈవెంట్‌లో టైటిళ్లు కొల్లగొట్టారు. సోమవారం ఇక్కడ ముగిసిన ఈ టోర్నీలో వీరేశ్, నందీశ్‌లతో కలిసి పాయింట్ల పరంగా సమానంగా నిలిచిన విఘ్నేశ్.. సూపర్ టైబ్రేక్ స్కోరులో పైచేయి సాధించి విజేతగా నిలిచాడు. బాలికల కేటగిరిలో శరణ్య ఆఖరి రౌండ్ ముగిసేసరికి అగ్రస్థానంలో నిలిచి ట్రోఫీ అందుకుంది.