Share News

పాన్‌ అమెరికన్‌ చెస్‌ విజేత సరయు

ABN , Publish Date - Aug 24 , 2026 | 06:19 AM

తెలుగమ్మాయి, 8 ఏళ్ల సరయు తలపనేని అంతర్జాతీయ చదరంగ వేదికపై అదరగొట్టింది...

పాన్‌ అమెరికన్‌ చెస్‌ విజేత సరయు

డాలస్‌ (అమెరికా): తెలుగమ్మాయి, 8 ఏళ్ల సరయు తలపనేని అంతర్జాతీయ చదరంగ వేదికపై అదరగొట్టింది. కొలంబియాలోని మెడెలిన్‌లో జరిగిన పాన్‌ అమెరికన్‌ యూత్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ అండర్‌-8 బాలికల క్లాసికల్‌ విభాగంలో సరయు విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో ఉత్తర, మధ్య, దక్షిణ అమెరికా దేశాలకు చెందిన 37 మంది క్రీడాకారిణులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన సరయు తల్లిదండ్రులు శ్రీలక్ష్మి, సందీప్‌ అమెరికాలోని డాల్‌సలో ఉంటున్నారు.

Updated Date - Aug 24 , 2026 | 06:19 AM