శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తిలో కొంతమంది విద్యార్థులు ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లు తొలగించి హైవేపై మితిమీరిన వేగంతో విన్యాసాలు చేస్తున్నారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారి బైక్లను స్వాధీనం చేసుకున్నారు. బైకులపై బీకర శబ్దాలతో వికృత చేష్టలకు పాల్పడుతున్న విద్యార్థులను.. స్టేషన్కు పిలిపించి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను సైతం స్టేషన్ పిలిపించి మందలించారు. లైసెన్స్ లేనివారికి వాహనాలు ఇస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.