సంగారెడ్డి జిల్లా చౌటాకూర్ మండలం కొర్పోల్ గ్రామంలో ఏర్పాటుచేసిన బెల్ట్ షాపులను ఎలా ఎత్తేస్తారంటూ మందుబాబులు మండిపడ్డారు. తాను సర్పంచ్ ఎన్నికల్లో గెలిస్తే గ్రామంలో ఏర్పాటు చేసిన బెల్ట్ షాపులను నిర్మూలిస్తానని గ్రామ సర్పంచ్ సునీత రెడ్డి ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు గ్రామంలో మొదటిసారి గ్రామసభ నిర్వహించి..బెల్ట్ షాపుల నిర్మూలన, మద్యం నిషేధంపై తీర్మానం చేస్తున్నామని చెప్పడంతో మందుబాబులు ఒక్కసారిగా ఆగ్రహించారు. బెల్ట్ షాపులు ఎలా బంద్ చేస్తారంటూ మద్యపానం తీర్మానానీకి అడ్డు తగిలారు. దీంతో గ్రామస్తులకు, మహిళలకు, మందుబాబులకు వాగ్వాదం జరిగింది.