కరీంనగర్ జిల్లా జగ్గయ్యపల్లి గ్రామంలో హైదరాబాద్ కు తాగునీటి కోసం తరలిస్తున్న సృజల స్రవంతి వాటర్ పైప్ లైన్ పగిలింది. దీంతో పెద్ద ఎత్తున వాటర్ ఎగిసిపడింది. గోదావరి నది నుంచి మానకొండూరు మండలం జగ్గయ్యపల్లి మీదుగా హైదరాబాద్ ప్రజలకు తాగునీటి కోసం భారీ పైప్ లైన్ ఏర్పాటు చేశారు. అయితే జగ్గయ్యపల్లి దగ్గర పైపులైన్ పగలటంతో హైదరాబాద్ కు వాటర్ సరఫరా నిలిచిపోయింది. ఉవ్వెత్తున నీరు ఎగిసి పడటంతో వాటర్ వర్క్స్ అధికారులు మోటార్లను ఆఫ్ చేశారు. మరమ్మతులు చేయటానికి రెండు రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.