విశాఖపట్నంలో అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. తిమ్మాపురం బీచ్ రోడ్‌లోని 'విరాగో పబ్'పై జీవీఎంసీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించి, ఎటువంటి అనుమతులు లేకుండా నడుపుతున్నట్లు గుర్తించారు. కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు పబ్‌ను తక్షణమే సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నగరంలోని ఇతర అక్రమ పబ్బులు ,నిర్మాణాలపై కూడా కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు.