విజయవాడ ఇంద్రకిలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చే భక్తులపై పార్కింగ్ కాంట్రాక్టర్, ఏజెల్ సెక్యూరిటీ సిబ్బంది విచక్షణారహితంగా దాడికి పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. పార్కింగ్ రుసుము విషయంలో ప్రశ్నించినందుకు భక్తులపై సిబ్బంది దాష్టీకానికి దిగుతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారి భక్తుల భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో కూడా పలుమార్లు ఇలాంటి దాడులు జరిగినప్పటికీ, ఆలయ అధికారులు పార్కింగ్ కాంట్రాక్టర్ల దోపిడీకి వత్తాసు పలుకుతూ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.