ప్రసిద్ధ సరస్వతీ దేవి క్షేత్రం బాసర ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 2 గంటలకు మంగళవాయిద్య సేవ, సుప్రభాత సేవలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారికి చండీవాహనం, వేదపారాయణంతో పాటు మహా పూజలు నిర్వహిస్తున్నారు. కాగా జ్ఞాన సరస్వతి అమ్మవారిదర్శనం కోసం భక్తులు పోటెత్తారు.సుదూర ప్రాంతాలకు చెందిన వారు అర్ధరాత్రే బాసరకు చేరుకున్నారు. గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. క్యూ లైన్లు కిక్కిరిసిపోగా.. అక్షరాభ్యాస మంటపాలు కిటకిటలాడుతున్నాయి.