కర్ణాటకలోని మైసూరులో ఇద్దరు యువకులు పోలీసుల ముందే అత్యంత ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ రెచ్చిపోయారు. అర్ధరాత్రి సమయంలో స్కూటర్‌పై 'వీలింగ్' చేస్తూ, గస్తీ తిరుగుతున్న పోలీసు కారును అలాగే దాటి వెళ్లారు. అంతటితో ఆగకుండా, బైక్‌పై వెళ్తున్న పోలీసులను కూడా అదే స్థితిలో ఓవర్టేక్ చేశారు.