జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చిన నవనీత్, సాయితేజ, సృజన్ పార్టీ ముగించుకుని కారులో వస్తుండగా, మద్యం మత్తులో వాహనం విద్యుత్ స్తంభాన్ని, డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో నవనీత్, సాయితేజ మరణించగా, సృజన్ పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.