మెదక్ జిల్లా తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి శివారులో రెండు చిరుత పులులు సంచరించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మల్కాపూర్ వెళ్లే దారిలో కొండపై ఉన్న ఈ చిరుతలను చూసిన కొందరు యువకులు తమ సెల్ఫోన్లలో వీడియోలు తీశారు. గతంలోనూ మల్కాపూర్, కొనాయిపల్లి, ధాతర్పల్లి పరిసరాల్లో చిరుతలు కనిపించాయి.