సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం దౌలాపూర్ గ్రామ పరిసర ప్రాంతాల్లో పులి అడుగు జాడలు కనిపించడంతో.. రైతులు, గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఉదయం పొలాల వద్దకు వెళ్లేందుకు రైతులు వెనుకంజ వేస్తున్నారు. నిన్న జగదేవపూర్ మండలం తిగుల్ గ్రామంలోనూ పులి అడుగు జడలు కనిపించగా.. నేడు దౌలాపూర్ గ్రామ పరిసరాల్లో పులి అడుగులను స్థానికులు గుర్తించారు. పలువురు రైతులు పులి అడుగులు ఉన్నట్లు గ్రామస్తులకు తెలుపగా.. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ అధికారులు స్థలాన్ని పరిశీలించి పాదముద్రలు పులివేనా కాదా అని నిర్ధారించాల్సి ఉంది.