నెల్లూరు జిల్లా ఉదయగిరి అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. ఉదయగిరి మండలం బండగానిపల్లి అడవుల్లో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాకు పెద్దపులి చిక్కిందని జిల్లా అటవీ అధికారి తెలిపారు. ఇటీవల గ్రామ మార్గాలకు దగ్గరగా పులి కదలికలు కనిపించడంతో గ్రామస్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పరిస్థితిని గమనించిన అటవీ శాఖ అప్రమత్తమైంది. పులి కదలికలపై నిరంతర నిఘా కొనసాగిస్తూ, ట్రాప్ కెమెరాల సంఖ్యను పెంచింది. ప్రత్యేక బృందాలతో గస్తీ చర్యలు ముమ్మరం చేసి, పులి జనావాసాల్లోకి రాకుండా చర్యలు చేపడుతోంది. రాత్రి వేళ అడవీ ప్రాంతాలకు వెళ్లవద్దని, ఒంటరిగా ప్రయాణాలు చేయొద్దని.. అటవీ అధికారులు గ్రామస్తులకు హెచ్చరికలు జారీ చేశారు.