అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట ముగ్గురు రైతులు ఆందోళనకు దిగారు. రాయదుర్గం మండలం మేచురి గ్రామానికి చెందిన రైతులు పెట్రోల్ చేత పట్టుకుని ఆందోళనకు దిగారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ పొందేందుకు ట్రాన్స్ఫార్మర్ల మంజూరుకు గత రెండేళ్లు కింద దరఖాస్తు చేసుకున్న నేటికి ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వకుండా విద్యుత్ శాఖ ఏఈ బాలచంద్ర వేధిస్తున్నాడంటూ రైతులు ఆందోళనకు దిగారు.తమకన్నా ఆలస్యంగా దరఖాస్తు చేసుకున్న వారికి ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చారు గానీ తమకు ఇవ్వడంలో విద్యుత్ శాఖ ఏఈ బాలచంద్ర ముడుపులు ఆశిస్తున్నట్లు రైతులు ఆరోపించారు.