AP: సత్యసాయి జిల్లా లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయం అద్భుత శిల్పకళకు కేరాఫ్ అడ్రస్. ఇక్కడి 70 స్తంభాలలో 'వేలాడే స్తంభం' ప్రధాన ఆకర్షణ. భూమిని తాకకుండా గాలిలో ఉండే ఈ స్తంభం కింద నుండి భక్తులు వస్త్రాన్ని తీస్తూ ఆశ్చర్యపోతుంటారు. విజయనగర సామ్రాజ్య కాలపు ఈ ఇంజినీరింగ్ అద్భుతాన్ని బ్రిటిష్ వారు సైతం ఛేదించలేకపోయారు. దేశవిదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న ఈ ఆలయం మన ప్రాచీన సాంకేతికతకు నిలువుటద్దం.