హైదరాబాద్ శివారు చెంగిచెర్లలో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. రెండు ఇళ్ల తాళాలు పగలగొట్టి భారీగా బంగారం, వెండి నగలతో పాటు నగదును దోచుకెళ్లారు. సంక్రాంతి సెలవులకు యజమానులు ఊరెళ్లడాన్ని ఆసరాగా చేసుకుని ఈ చోరీలకు పాల్పడినట్లు తెలుస్తోంది.