బాపట్ల జిల్లా చీరాలలో దొంగలు హల్చల్ చేశారు. స్థానిక హౌసింగ్ కాలనీలోని ఓ ఇంట్లోకి చొరబడి కత్తులతో బెదిరించి నెల్లూరు కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా విధులు నిర్వహిస్తున్న వెంకట లక్ష్మీ కుమారి, ఆమె సోదరుడు రామాంజనేయులు మీద దాడి చేశారు. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న సుమారు 8 సవర్ల బంగారు ఆభరణాలను దొంగలు అపహరించుకుపోయారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న చీరాల వన్‌టౌన్ పోలీసులు.. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్లను రంగంలోకి దింపి దర్యాప్తు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నలుగురు వ్యక్తులు మరణాయుధాలతో సంచరిస్తున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. వీటి ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.