హైదరాబాద్ హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగల హల్చల్ చేశారు. కుంట్లూరు ఇష్టకామేశ్వరి దేవాలయం వెనకాల ఉన్న ఓ కిరాణా దుకాణంలో చొరబడిన దొంగలు.. షాప్‌లోని లక్షా యాభై వేల రూపాయలను చోరీ చేశారు. షాప్‌లోని సీసీ కెమెరా వైర్లను కత్తిరించి దొంగతనానికి పాల్పడినట్లు దుకాణ యజమానులు తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హయత్‌నగర్ పోలీసులు తెలిపారు.