ఉత్తర్ ప్రదేశ్లోని మహోబా ప్రభుత్వ పాఠశాలలో సిబ్బంది దారుణానికి ఒడిగట్టారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాల్సింది పోయి, బకెట్ నీళ్లలో కొద్దిపాటి పాలు కలిపి విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల కక్కుర్తి వల్ల పిల్లల ఆరోగ్యం దెబ్బతింటోందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.