ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల రాణి చిన్నమ్మారావు వీధిలో ఓ ఇంట్లో గుర్తుతెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. సుమారు రెండు లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితులు చెబుతున్నారు. రాత్రి అందరూ నిద్రపోయిన సమయంలో.. పక్క గదిలో ఉన్న బీరువాని పగలగొట్టి అందులో ఉన్న సుమారు రెండు లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్లారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్లూస్ టీం బృందాలతో దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.