విశాఖ జిల్లా పెందుర్తిలోని వెంకటేశ్వర జ్యువెలరీలో పట్టపగలే దొంగతనం కలకలం రేపింది. ఉదయం 11 గంటల సమయంలో నలుగురు మహిళలు కస్టమర్లలా నటిస్తూ షాపులోకి ప్రవేశించి, బంగారం బుట్టలు చూపించాల్సిందిగా సిబ్బందిని కోరారు. ఆ సమయంలో చాకచక్యంగా సుమారు రెండు తులాల బంగారాన్ని దొంగిలించి అక్కడి నుండి పారిపోయేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన షాపు సిబ్బంది వెంబడించి నలుగురు మహిళలను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పెందుర్తి క్రైమ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, దొంగతనానికి పాల్పడిన మహిళలను విచారిస్తున్నారు.