మహబూబాబాద్ జిల్లా కురవి మండలం రాజోలు గ్రామంలో.. గీతా వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న సిలువేరు వెంకన్న అనే గీతా కార్మికుడు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. తాటి చెట్టు ఎక్కిన అనంతరం కాలుకున్న గుజి ఊడి పోవడంతో వెంకన్న ప్రమాదంలో పడిపోయాడు. ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు తాటి కొమ్మను గట్టిగా పట్టుకున్నాడు. దాదాపు 3 గంటలపాటు గాలిలో వేలాడుతూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఉండిపోయాడు. ఫైర్ ఇంజిన్ నిచ్చెనతో.. గ్రామస్తుల సాయంతో అధికారులు వెంకన్నను కిందకు దించడంతో.. అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.