ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నర్సింహులగూడెంలో దారుణం వెలుగుచూసింది. పాఠశాల విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు వీరయ్యపై విద్యాశాఖ కఠిన చర్యలు తీసుకుంది. అతడిని సర్వీస్ నుంచి శాశ్వతంగా తొలగిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది అక్టోబర్లో 6, 7 తరగతులు చదువుతున్న విద్యార్థినులపై వీరయ్య లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ప్రధానోపాధ్యాయుడి దృష్టికి వచ్చింది. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు, ప్రాథమిక ఆధారాలతో మొదట అతడిని సస్పెండ్ చేశారు. అనంతరం కూసుమంచి పోలీసులు వీరయ్యపై పోక్సో కేసు నమోదు చేశారు.