మహబూబాబాద్ జిల్లాలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో నాణ్యమైన విద్య, నైపుణ్యావృద్ధి కోసం మౌలిక వసతులు కల్పించాలంటూ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట విద్యార్థినిలు బైఠాయించి మౌనదీక్ష చేపట్టారు. కాలేజీలో విశాలమైన తరగతి గదులు, ఆధునిక ప్రయోగశాలలు, సురక్షితమైన వసతి భవనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలలో మౌలిక వసతులు కరువయ్యాయని.. అధికారులకు పలుమార్లు వినతి పత్రాలు సమర్పించినా పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే.. ఆందోళన ఉద్ధృతం చేస్తామని తెలిపారు.