పెళ్లి వేదికపై ఫొటోషూట్ కోసం వధూవరులు అతిగా రొమాంటిక్ పోజులు ఇవ్వడం ఒక పూజారికి ఆగ్రహం తెప్పించింది. కెమెరామెన్ సూచనలతో నూతన జంట హగ్ చేసుకుని ముద్దులకు సిద్ధమవుతుండగా, పూజారి జోక్యం చేసుకుని వారిని వారించారు. పవిత్రమైన మంటపంపై ఇలాంటివి వద్దంటూ ఆయన వార్నింగ్ ఇవ్వడంతో అతిథులంతా అవాక్కయ్యారు. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో, పూజారి చేసిన పని సంప్రదాయబద్ధమని కొందరు సమర్థిస్తుంటే, మరికొందరు మాత్రం ఆయన పద్ధతి సరికాదని విమర్శిస్తున్నారు.