కర్నూలు నగర పాలక సంస్థ కార్యాలయం ముందు రేణుక నగర్ వాసులు భారీ ఆందోళన చేపట్టారు. కోడుమూరు రోడ్డులోని సర్వే నంబర్ 116లో తాము 1985లో కొనుగోలు చేసిన ప్లాట్లను, మున్సిపల్ అధికారులు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ప్రభుత్వ భూమిగా బోర్డు పెట్టడాన్ని బాధితులు తీవ్రంగా ఖండించారు. అధికారులు పెట్టిన ఆ బోర్డును స్వయంగా తీసేసి మున్సిపల్ ఆఫీసు వద్దకు తెచ్చి నిరసన తెలిపారు. 11 సెంట్ల స్థలంలోని తమ ప్లాట్లపై సమగ్ర విచారణ జరిపి, పేదలమైన తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు.