విశాఖలోని గాజువాకలో సంక్రాంతి నాడు జరిగిన షాపింగ్ మాల్ చోరీ కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. వైజాగ్ షాపింగ్ మాల్లో ఒక మహిళకు చెందిన బ్యాగ్‌ను దొంగిలించిన నిందితుడిని, సిసిటీవి కెమెరా, వాహనం ఆధారంగా క్రైమ్ పోలీసులు పక్కాగా గుర్తించారు. స్మశాన వాటికలో దాచి ఉంచిన బ్యాగును స్వాధీనం చేసుకుని, అందులోని బంగారం, నగదును బాధితురాలికి సురక్షితంగా అందజేశారు. పోలీసుల వేగవంతమైన దర్యాప్తును , వారు కనబరిచిన ప్రతిభను విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ప్రత్యేకంగా అభినందించారు.