శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్నవారికి పోలీసులు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారు. గంజాయి విక్రయిస్తున్న నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే నిందితులను కదిరి పట్టణంలోని రోడ్లపై నడిపిస్తూ ఊరేగింపుగా పోలీస్ స్టేషన్కు తరలించారు. భవిష్యత్తులో గంజాయి విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. మరోవైపు.. గంజాయి సేవిస్తున్న 12 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి కదిరి పోలీసులు తమదైన శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇక గంజాయి నిందితులకు పోలీసులు ఇచ్చిన స్పెషల్ ట్రీట్మెంట్ పై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.