గుంటూరు జిల్లా తెనాలిలో రౌడీ షీటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రౌడీ షెటర్లపై ఎప్పటికప్పుడు నిఘా పెడుతూ అవసరమైతే బైండోవర్ కేసులు పిడి యాక్ట్ నమోదు చేస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం 30మందిపై బైండోవర్ కేసు నమోదు చేయగా.. తాజాగా మరో 30 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. రౌడీ షీటర్ల వల్ల సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలిగిన ఉపేక్షించబోమని పోలీసులు హెచ్చరించారు. వీరిలో కొంతమందిపై మర్డర్ కేసు, గంజాయి కేసు, చిన్నపిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, ఘర్షణ పడిన కేసులు ఉన్నట్లు తెలిపారు. మొత్తంగా తెనాలి పరిధిలోని నాలుగు పోలీస్ స్టేషన్ల పరిధిలో సుమారు 600మందికి పైగా బైండోవర్ కేసులు ఉన్నట్లు తాహశీల్దార్ వెల్లడించారు.