రెండవ శ్రీశైలంగా పేరొందిన నల్గొండ జిల్లా చెర్వుగట్టు పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. నేటి నుంచి ఈనెల 30వ వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనుండగా.. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.ఆదివారం తెల్లవారుజామున తెల్లవారితే సోమవారం రామలింగేశ్వర స్వామి కళ్యాణం,మంగళవారం తెల్లవారితే బుధవారం అగ్ని గుండాలు , బుధవారం తెల్లవారుజామున తెల్లవారితే గురువారం అశ్వవాహన సేవ, రాత్రిపూట ఏకాంత సేవల కార్యక్రమం జరగనుంది. స్వామివారి కల్యాణాన్ని వీక్షించేందుకు, భక్తులు వడి బియ్యం తలంబ్రాలు సమర్పన కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు.