డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోనకు చెందిన వ్యాపారి బండారు దొరబాబుకు చెందిన చిలుక ఎట్టకేలకు దొరికింది. దొరబాబు రూ.80వేలు పెట్టి.. ఆఫ్రికన్ గ్రే ప్యారట్ జాతి చిలుకను కొని ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్నారు. స్వగ్రామం కొత్తపాలెంలోని ఇంట్లో పెంచుకుంటున్న ఆ చిలుక పది రోజుల క్రితం ఎగిరిపోయి తిరిగి రాలేదు. వారం రోజులుగా తీవ్రంగా గాలించారు. ఆదివారం అయినవిల్లి మండలం మాగంలో ఓ వ్యక్తి వద్ద ఉన్న ఈ చిలుకను... మరో యువకుడు స్వాధీనం చేసుకుని దొరబాబుకు విషయం చెప్పారు. అక్కడికి వెళ్లి చిలుకను ఇంటికి తెచ్చుకున్న దొరబాబు.. సంతోషం వ్యక్తం చేశారు.