విశాఖపట్నం పెందుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. జీవీఎంసీ 97వ వార్డు కార్పొరేటర్ వసంత శంకర్రావు ఆధ్వర్యంలో సుమారు 5 కోట్ల 85 లక్షల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు విశాఖ మేయర్ పీల శ్రీనివాస్, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వంలో నియోజకవర్గం మొత్తం మీద జరగని అభివృద్ధి, ఇప్పుడు కేవలం ఒకే వార్డులో ఆరు కోట్ల వ్యయంతో జరుగుతోందని ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి అంటే ఏంటో ప్రజలు స్వయంగా చూస్తున్నారని, ప్రజల నుంచి వస్తున్న సానుకూల స్పందన తమకు మరింత ఉత్సాహాన్ని ఇస్తోందని రమేష్ బాబు పేర్కొన్నారు.