అన్ని వ్యాధులకు ఇంటి వైద్యంలా భావించే వేప చెట్టుకు ముప్పు వాటిల్లుతోంది. ఎక్కడ చూసినా వేప చెట్లు ఎండిపోయి మోడు వారిపోతున్నాయి. కారణం ఏంటో అంతుచిక్కడం లేదు. చిగుర్ల నుంచి ప్రారంభమై వేప చెట్లు నిలువునా ఎండిపోతున్నాయి. తెలంగాణలో అనేక ప్రాంతాల్లో వేప చెట్లు నిర్జీవంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే.. డై బ్యాక్ డిసీజ్ వల్ల కానీ.. టీ మస్కిటో బగ్ వల్ల కానీ ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రకృతిలో ఎం జరుగుతుందో ఏమో కానీ ప్రస్తుతం నూతన వైరస్లతో, వివిధ కీటకాలతో మనుషులకే కాకుండా చెట్లకు కూడా ముప్పు వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.