ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం బ్రహ్మ బోట్ల వారిపాలెంలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. గత రెండు రోజుల నుండి గ్రామంలోని కోండలరావు అనే వ్యక్తి ఇంటి వద్ద ఉన్న వేప చెట్టుకు దారాళంగా పాలు కారుతున్నాయి. వేప చెట్టు పైభాగం నుండి కింది వరకు ఒక దార మాదిరిగా ఈ పాలు వస్తున్నాయి. ఈ వింతను కోండలరావు శుక్రవారం చూడగా.. తెల్లవారే సమయానికి ఈ దార మరింత పెరిగి కింద వరకు చేరుకున్నాయి. ఈ వింత సంఘటనను చూసేందుకు గ్రామంలోకి ప్రజలు తరలివస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.