మృత్యువు బిడ్డను తీసుకెళ్లినా మాతృప్రేమ మళ్లీ ప్రాణం పోసింది. యుద్ధంలో అమరుడైన కొడుకు జ్ఞాపకార్థం ఇంట్లోనే విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్న ఆ తల్లి.. రోజూ తన చేతులతో గోరుముద్దలు తినిపిస్తోంది. వణుకుతున్న చేతితో ఆ విగ్రహం ముఖాన్ని నిమురుతుంటే ఆ శిల సైతం కన్నీరు పెట్టేలా ఉంది. దేశం కోసం బిడ్డను అర్పించిన ఆ వీరమాతకు ఆ శిల్పమే సర్వస్వం.