విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ పిలుపునిచ్చారు. పత్తికొండ పట్టణంలోని ఎంపీ యూపీ సెంట్రల్ స్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన.. విద్యార్థులతో ముచ్చటించి మధ్యాహ్న భోజనం, విద్యాబోధన తీరును అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తోందని, ముఖ్యంగా బాలికల విద్యను ప్రోత్సహించాలని ఆయన సూచించారు. అనంతరం తనకు కానుకలుగా వచ్చిన నోట్ పుస్తకాలు, పెన్నులను విద్యార్థులకు పంపిణీ చేసి వారిలో ఉత్సాహాన్ని నింపారు.