ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, నెట్టెం రఘురాం పాల్గొని సందడి చేశారు. గంగిరెద్దుల విన్యాసాలు, కోలాటాలు, బంజారా మహిళల నృత్యాలతో పట్టణం పల్లెటూరిని తలపించగా.. ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ స్వయంగా కర్రసాము చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. మన సంస్కృతిని ప్రతిబింబించేలా ఇలాంటి వేడుకలు నిర్వహించడం అభినందనీయమని ఎంపీ కేశినేని శివనాథ్ కొనియాడారు.