తాజాగా ఒక మహిళ ఫోన్ చూస్తూ లిఫ్ట్ దిగుతుండగా, చిన్నారి చేయి తలుపుల్లో చిక్కుకున్న వీడియో కలకలం రేపుతోంది. ఆమె దృష్టి ఫోన్‌పై ఉండటంతో ప్రమాదాన్ని గుర్తించలేకపోయింది. మనం చేసే చిన్న పొరపాటు పిల్లలను ప్రమాదంలో పడేస్తుంది. అందుకే లిఫ్ట్‌లు, మెట్లు, రద్దీ ప్రదేశాలలో ఉన్నప్పుడు ఫోన్ పక్కన పెట్టి పిల్లలపై దృష్టి సారించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అప్రమత్తతే మీ బిడ్డకు రక్షణ.