నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండల ఎంపీటీసీ కృపాకర్ కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఈనెల 31వ తేదీన ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు టీడీపీ వర్గం ఎంపీటీసీలు రంగం సిద్ధం చేశారు. టీడీపీ నాయకులతో పాటు ఉన్న జూపాడుబంగ్లా ఎంపీటీసీ కృపాకర్ ను ఉమ్మడి గుంటూరు జిల్లా నరసరావు పేటలో భోజనం చేస్తుండగా కొంతమంది వైసీపీ నాయకులు అక్కడికి వచ్చి తీసుకెళ్లినట్లు నరసరావుపేట పోలీస్టేషన్లో జంగాల పెద్దన్న ఫిర్యాదు చేశారు. దీంతో కృపాకర్ హైదరాబాదులో ఉన్నట్లు సమాచారం మేరకు నరసరావుపేట పోలీసులు, నందికొట్కూరు పోలీసులు అప్రమత్తమై హైదరాబాదుకు వెళ్లినట్లు సమాచారం.