గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఓ సింగపూర్ ఇండిగో విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానం ల్యాండింగ్‌కు సమస్య ఎదురైంది. పొగమంచు దట్టంగా కమ్మేయడంతో విమానం దాదాపు అరగంట పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. చాలా సేపు విమానం గాల్లోనే ఉండటంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. చివరకు లైన్ క్లియర్ అవడంతో విమానాన్ని పైలట్ సురక్షితంగా రన్‌వై పైకి చేర్చారు. పొగమంచు కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు, విమానయాన సిబ్బంది చెప్పుకొచ్చారు. అయితే.. చివరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. ఆ ఫ్లైట్ సేఫ్‌గా రన్‌వేపై ల్యాండ్ అయ్యింది.