కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో విషాదం నెలకొంది. కౌతాలం మండలం మ్యాలిగనూర్ గ్రామంలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించి మూడు గడ్డివాములు పూర్తిగా దహనమయ్యాయి. గ్రామానికి చెందిన శరణప్ప అనే రైతు, తన పశువుల మేత కోసం సుమారు రెండు లక్షల రూపాయలు వెచ్చించి ఖరీఫ్ సీజన్లో ఈ వరిగడ్డిని కొనుగోలు చేశారు. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో గడ్డివాములు వేగంగా అంటుకున్నాయి. స్థానికులు నీటితో మంటలను అదుపు చేసేందుకు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా, అప్పటికే గడ్డివాములు పూర్తిగా కాలిబూడిదయ్యాయి.