పొగాకు ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం విధించిన 40 శాతం జీఎస్టీని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో రైతులు భారీ నిరసన చేపట్టారు. దేవరపల్లి, గోపాలపురం, నల్లజర్ల మండలాల నుంచి తరలివచ్చిన వేలాది మంది రైతులు వేలం కేంద్రం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించి, అక్కడ మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. జీఎస్టీ పెంపు వల్ల సిగరెట్ల ధరలు పెరిగి, విదేశీ సిగరెట్ల స్మగ్లింగ్ పెరిగే అవకాశం ఉందని, దీనివల్ల దేశీయంగా పొగాకు ధరలు పడిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు.