హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలో ప్రకృతి సృష్టించిన ఆటంకాలను అధిగమిస్తూ సాగిన ఒక అసాధారణ వివాహం అందరినీ ఆశ్చర్యపరిచింది. భారీగా మంచు కురుస్తున్నప్పటికీ వరుడు గితేశ్ ఠాకూర్ తన కుటుంబంతో కలిసి 7 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి వధువు ఇంటికి చేరుకున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయి, రోడ్డు మూసుకుపోయినప్పటికీ చిమ్మచీకటిలో మంచు కురుస్తుండగానే వివాహ వేడుకను సంప్రదాయబద్ధంగా చేశారు.