కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం రాంపురం శ్రీ రామలింగేశ్వరస్వామి మహ రథోత్సవం ఊరేగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ ధర్మకర్తల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా పురవీధుల్లో మహా రథోత్సవంపై రామలింగేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా ఊరేగించారు. ఉత్సవాలకు వివిధ మతాలకు చెందిన పీఠాధిపతులు హాజరై భక్తులను ఆశీర్వదించారు. ఏపీ, తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరవివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.