ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు రైల్వేస్టేషన్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో గూడ్స్ రైలులోని వ్యాగన్లు.. పక్కనే ఉన్న రెండు రైల్వే ట్రాక్‌లపై పడిపోయాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే శాఖ అధికారులు, సాంకేతిక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. గూడ్స్ బోగీలు పట్టాలు తప్పడంతో.. విజయవాడ- చెన్నై ప్రధాన రైల్వే మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.