విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. మన్యం నుండి మైదాన ప్రాంతంలో ఏనుగులు తెగబడటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. రాజుపేటలోని మొక్కజొన్న పంట పొలాల్లో తిష్టవేశాయి. పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతానగరం మండలంలోని జగ్గునాయుడుపేట పొలిమేరలోని కల్లాల్లో ధాన్యం రాశులను నాశనం చేశాయి. దీంతో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు, ప్రత్యేకించి రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.