గోల్కొండ కోట సాక్షిగా హైదరాబాద్ ఆకాశంలో హాట్ ఎయిర్ బెలూన్ల సందడి మొదలైంది. ఈ సరికొత్త పర్యాటక ఉత్సవాన్ని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా బెలూన్లో విహరించి ఘనంగా ప్రారంభించారు. తెలంగాణ పర్యాటక రంగంలో ఇదొక కొత్త అధ్యాయమని, మన సంస్కృతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ఇవి తోడ్పడతాయని మంత్రి ఆకాంక్షించారు. రంగురంగుల బెలూన్లు గగనవీధిలో విహరిస్తూ నగరవాసులకు కనువిందు చేయగా.. ఈ అద్భుత వేడుకలో పర్యాటక శాఖ ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.