భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా మంచు దుప్పటి కప్పేసింది. ఉదయం వేళలో బయటకు రావాలంటే ప్రజలు వణికిపోతున్నారు. పొంగమంచుతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రోడ్లపై వాహనదారులు మరీ నెమ్మదిగా ప్రయాణం సాగించాల్సి వస్తోంది. పొగమంచు కారణంగా అధిక వేగంతో వాహనాలు నడపి ప్రమాదాలబారిన పడవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.